Tuesday, December 7, 2010
కుక్కలు కూడా ఆ సినిమా చూడవు
కుక్కలు కూడా ఆ సినిమా చూడవు అంటూ తన ఆవేశాన్నంతా వెల్లగక్కాడు సల్మాన్ ఖాన్. గుజారిష్ స్పెషల్ స్క్రీనింగ్ కి వచ్చిన సల్మాన్, సినిమా చూసి బయటకి వచ్చి ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇంతకీ సల్మాన్ బాధేంటంటే... అసలీ సినిమా సల్మాన్ ఖాన్ హీరోగా రావాల్సింది. రెండేళ్ల క్రితం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గరకు దప్రెస్టీజ్ అనే నవల డీవీడీ వెర్షన్ తీసుకెళ్లాడు సల్మాన్. అది చూసిన సంజయ్, ఇలాంటి స్టోరీతో సినిమా తీస్తే బాగుంటుందని, అందులో నువ్వే హీరోగా ఉండమని సల్మాన్ కి చెప్పాడు. తర్వాత ఏమయిందో ఏమో సీక్రెట్ గా హృతిక్ రోషన్ ని హీరోగా తీసుకున్నాడు. దీంతో సల్మాన్ తెగ ఇదయిపోయాడు. బయట ఎక్కడా మాట్లాడలేదు కానీ, తీరా సినిమా చూసి ఒపీనియన్ చెప్పమనేసరికి ఇలా విరుచుకు పడ్డాడు. ఎంతయినా ఓ మంచి ఛాన్స్ మిస్సయ్యాడు కదా. ఆమాత్రం కడుపు మంట ఉంటుంది లెండి. విప్పుతున్నా పట్టించుకోరేం..!
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment