Wednesday, December 8, 2010
ఫైటర్ల డిష్యూం..డిష్యూం
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు బంద్ పాటిస్తోంది.కందిరీగ సినిమా షూటింగ్ లో జరిగిన లోకల్ నాన్ లోకల్ ఫైటర్ల ఫైటింగ్ షూటింగ్ ల బంద్ కి దారితీసింది.కందిరీగ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కిస్తున్న స్టన్ శివ నిబంధనలకు విరుధ్దంగా తమిళ ఫైటర్లను ఎక్కువ మంది ని తీసుకొచ్చారంటూ తెలుగు ఫైటర్లు ఆందోళనకు దిగారు.అసలే ఫైటర్లు కావడంతో లైట్ గా కొట్టుకున్నారు.దీంతో ఉలిక్కిపడ్డ సినీపరిశ్రమ పెద్దలు..ఈరోజు షూటింగ్ లకు బంద్ ప్రకటించి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.అరవ టెక్నీషియన్ల మన వారి మోజే ప్రస్తుత పరిస్థితులు శృతిమించడానికి కారణమని .. ముందుముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు మన రాష్ట్ర కళాకారులు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment