Tuesday, December 7, 2010
రజనీ అల్లుడు నుంచి గిఫ్ట్ అందుకున్న తాప్సి
ధనుష్, తాప్సి జంటగా ఆడుక్కాలమ్ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో తమిళ్ రాక పంజాబీ సుందరి తాప్సి తెగ ఇబ్బంది పడుతోందట. ఇది చూసి తట్టుకోలేకపోయిన ధనుష్ అమ్మడికి అర్జంటుగా తమిళ్ నేర్పించే పనిలో పడ్డాడు. ముప్పై రోజుల్లో తమిళం అనే పుస్తకం కొనుక్కొచ్చి ఇచ్చాడు. అంతటితో ఆగిపోకుండా డౌట్స ఉంటే ఫోన్లో క్లారిఫై చేసుకోమంటూ సలహా కూడా ఇచ్చాడు. ఇంతకీ ఫోన్లో తాప్సికి ఏడౌట్లు క్లియర్ చేస్తాడో ధనుష్. కత్తిపట్టడమే కాదు, కత్తిలాంటి పోరీని పటాయించడం కూడా తెలుసు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment