Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Tuesday, December 21, 2010

కిరణ్ సర్కారు ఉంటుందా..? ఊడుతుందా..?


కిరణ్ సర్కారుకి మూడిందనేది జగన్ వర్గం బహిరంగగానే చెబుతోంది.ప్రభుత్వం పతనమవుతుందని జగన్ లక్ష్య దీక్ష కు వచ్చిన నాయకులంతా పదే పదే చెప్పారు. అసలు ఇందులో పరమార్థం అతి త్వరలో జగన్ ఎమ్మేల్యేలను కూడగట్టి..ప్రభుత్వాన్ని కూల్చవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.అయితే ఈ చెడ్డ పేరు జగన్ కు రాకుండా మేనేజ్ చేసి ఎలా ప్రభుత్వాన్నికూల్చలన్నదే ఇప్పుడు జగన్ వర్గం ముందున్న ప్రధాన ఎజెండా.ఎలాగూ టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతానంటుంది. నిజంగా టీడీపీ ఆ పని చేస్తే..జగన్ కు కచ్చితంగా మేలు జరిగినట్టే. అప్పుడు జగన్ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది.ఆ సమయంలో జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కావాల్సినంత మందిని తన వైపు లాక్కుంటే చాలు.మధ్యంతర ఎన్నికలు వచ్చినట్టే. ప్రభుత్వాన్ని కూలగొట్టడనే అపప్రద నుంచి కూడా జగన్ బయటపడవచ్చు. ప్రతిపక్షమే ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టింది కాబట్టి ఆ పాపం జగన్ ది కాదని సేఫ్ కావచ్చు. ప్రస్తుతం జగన్ ముందున్న లక్ష్యం. లక్ష్య దీక్ష వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే. జనం తన వైపు ఉన్నారనేది నిరూపించుకుంటూ..ఎక్కువ మంది ఎమ్మేల్యేలను తన వైపుకు తిప్పుకోవడం. దానికే జగన్ లక్ష్యదీక్ష కోసం సర్వశక్తులు ఒడ్డారు. ఎమ్మేల్యేలను తన వైపు తిప్పుకునే లక్ష్యంలో మీడియా కూడా చాలా ఇంపార్టంట్ అనేది జగన్ కు బాగా తెలుసు.అయితే జగన్ వైపు ఎమ్మేల్యేలు ఎక్కువ మంది వెళుతున్నారనేది సొంత ఛానల్ సాక్షిలో వస్తే ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ యత్నిస్తున్నాడనే వాదన బలపడవచ్చు. ఇది ముందే ఊహించింది జగన్ వర్గం. అందుకే టీవీ5,ఎన్టీవీ, ఐ న్యూస్ ద్వారా జగన్ వైపు ఎమ్మేల్యేలు చూస్తున్నారనే దానిని బాగా ఎక్స్ పోజ్ చేస్తుంది.టీవీ 9 జగన్ కు వ్యతిరేకంగా ఉంటే..టీవీ5,ఎన్టీవీ, ఐ న్యూస్ లు జగన్ అనధికారిక ఛానల్స్ గా కొనసాగుతున్నాయి. అందుకే వాటి ద్వారా జగన్ వర్గం హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే నిజానికి కూడా జగన్ వైపు చూసే ఎమ్మేల్యేల సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ వారందరికి ఒక్కటే సందేహం..భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది.జగన్ వైపు వెళితే..ఎన్నికలు తప్పవు.వెంటనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా..?లేదా..? ఇలాంటి డౌట్స్ తో పాటు..జాతీయ పార్టీలో ఉంటే..ఇఫ్పటికి ఇఫ్పుడు కాకపోయినా భవిష్యత్ లో కిరణ్ కుమార్ రెడ్డి టైపులో ఏదైనా మంచి ఛాన్సు రాకపోతుందా..? అనుకునేవాళ్లు మరికొందరు.. అయితే ఇలాంటి డౌట్స్ అన్ని పక్కన పెట్టి జగన్ వైపు రావాలంటే.. జగన్ పార్టీపై వారికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కల్పించడానికే జగన్

No comments:

Post a Comment


Namitha Latest pics