Click here to log into your Google account and subscribe to Telugushakthi channels
click here

Monday, December 6, 2010

భూవివాదంలో అనుష్క


అందాల అనుష్క  నటిగానే కాకుండా మంచి వ్యక్తిగా కూడా మన సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. వివాదాలకు, గొడవలకు ఎప్పుడూ దూరంగా వుంటుంది. తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి అనుష్క ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకొంది.రెండేళ్ల క్రితం వైజాగ్ లో కొందరు సినీప్రముఖులతో కలిసి అనుష్క కూడా విశాఖ జిల్లా భీమిలిలో కొంత భూమి కొనుగోలు చేసింది.అయితే ఆ స్థలం తనదేనని తనకి తెలియకుండా ఎవరో అక్రమంగా  అనుష్కకి అమ్మేశాడని ఓ ఎన్నారై కోర్టు కెక్కాడు.  ఈ కేసు విషయమై కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, అనుష్క వాటిని పట్టించుకోలేదు.దీంతో ఈ కేసు విచారణను చేపట్టిన న్యాయమూర్తి  జనవరి 28 న  అనుష్క వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీచేసింది. మరి దీనిని ఈ ముద్దుగుమ్మ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి!  తరలిపోతున్న టాలీవుడ్..

2 comments:


Namitha Latest pics