Friday, December 10, 2010
వణుకుతున్న దిల్ రాజు
బృందావనం కంటే ముందే దిల్ రాజు నాగార్జునతో గగనం సినిమా ప్లాన్ చేశాడు. ముందే షూటింగ్ కంప్లీట్ చేశాడు. తీరా బృందావనం రిలీజైంది. కానీ గగనం మాత్రం ప్రేక్షకుల ముందుకు తేలేకపోయాడు దిల్ రాజు. దీని తర్వతా ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మరో సినిమా కూడా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. కానీ గగనానికి మాత్రం రెక్కలు రాలేదు. ఇదంతా నాగార్జున సినిమా ఎఫెక్టే. రగడ డిసెంబర్లో ఉండటంతో.. గగనాన్ని జనవరికి పోస్ట్ పోన్ చేశాడు. రగడ సూపర్ హిట్ అయితే ఆ ఎఫెక్ట్ తో గగనాన్ని కూడా హిట్ చేసుకోవాలనుకుంటున్నాడు దిల్ రాజు. ఒకవేళ రగడ రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చిందా, దాంతోపాటు గగనం కూడా గల్లంతే. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని గగనానికి రగడ హిట్ కావడం ఎక్కటే ప్రమోషన్ అవుతుంది. సో.... దిల్ రాజు ముందు రగడ హిట్ కావాలని కోరుకుంటున్నాడు.కుర్రదానిలా కనిపించాలని తహతహ
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment