Sunday, November 28, 2010
జగన్ రాజీనామా..
అనుకున్నదే అయ్యింది.జగన్ పార్టీని వీడారు.పొమ్మనకుండా పొగబెట్టలానే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాం సక్సెస్ అయింది. జగన్ తానంతట తాను పార్టీని వీడారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు.జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నించడం తమకు మనస్థాపం కలిగించిందనే కారణంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ అబిమానులను వేధించేలా..అణిచివేసేలా హైకమాండ్ వ్యవహారిస్తుందని జగన్ మొట్టమొదటి సారి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.కాంగ్రెస్ హైకమాండ్ పీఆర్పీ తో దోస్తి కట్టడం..వారికి మంత్రి పదవులు ఆఫర్ చేయడం ఇవన్నీ తనపై చర్య తీసుకునేందుకు ముందస్తు సన్నాహాలుగా భావించిన జగన్ రాజీనామా అస్త్రంతో జగన్ సైలంట్ లేరనే సంకేతాలు జనాల్లో పంపేందుకు ప్రయత్నించారు. జగన్ రాజీనామాతో జగన్ వెంట నడిచే 17 మంది ఎమ్మేల్యేలు కూడా త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉంది. జగన్ వీరందరితో కూడా మాట్లాడినట్టు తెలిసింది. రాజీనామా చేసిన ఎమ్మేల్యేలను గెలిపించే బాధ్యత తనదే నని జగన్ చెప్పినట్టు సమాచారం.మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్.. జగన్ మధ్య ఇన్నాళ్లు జరిగిన కోల్డ్ వార్.. ఇప్పుడు ప్రత్యక్షపోరాటం కాబోతుంది. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టబోతుంది.మరిన్ని వివరాలు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment